12-04-2025 12:16:57 AM
మేడ్చల్, ఏప్రిల్ 11(విజయ క్రాంతి): జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సైనిక్ పూరి చౌరస్తాలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభా ష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల బస్ డిపో వద్ద ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పూలమాలలు చూసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పూలే సేవలను కొ నియాడారు. మేడ్చల్ పట్టణంలోని చెక్ పోస్ట్ వద్ద బీ ఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, రాజ్ కుమార్, నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఉదండపురం సత్యనారాయణ, మర్రి నరసింహారెడ్డి, కోడె మహేష్ నివాళులర్పించారు.