01-03-2025 08:41:00 PM
జాగిలం టాంగోకు ప్రశంస పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని మొయినాబాద్ లో 9 నెలల పాటు కఠోర శిక్షణ పొంది, జిల్లాకు వచ్చిన నూతన జాగిలం టాంగోను శుక్రవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలంకు పోలీస్ సిబ్బంది పరిచయం చెయించారు. ఈ సందర్భంగా టాంగో, జాగిలం హాంగులర్ సోమన్న కు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. అదేవిధంగా జిల్లాకు బాంబులను కనుగొనడంలో ఉపయోగించే నూతన పరికరం ఎన్.ఎల్.జి.డి ని కేటాఇంచడం జరిగింది. ఈ పరికరాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అంతర్గత భద్రతలలో కీలక పాత్ర పోషించనున్న జాగిలాల బృందానికి అదనపు బలంగా నూతన జాగిలం టాంగో రావడం సంతోషకరం అని ఎస్పీ అన్నారు. ఈ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ జాతికి సంబందించిందని, జిల్లాలో ఐదు పేలుడు పదార్థాలను కనుగొనే జాగిలాలు, రెండు నేరస్థులను కనుగొనడంలో ఉపయోగపడే జాగిలాలు, ఒక మత్తు పదార్థాలను కనుగొనే జాగిలం మొత్తం ఎనిమిది జాగిలాల బృందంతో జిల్లా రక్షణ భద్రత విషయంలో వాటి పాత్రను పోషించనున్నాయని తెలిపారు.