08-02-2025 10:48:18 PM
మణుగూరు (విజయక్రాంతి): జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన నేషనల్ ట్వైకాండో అండర్-73 కేజీల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండల చెందిన గిరిజన యువతి పాయం హర్షప్రద తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ సాధించింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి విజయ సాధించడంపై ఆళ్లపల్లి మండలానికి చెందిన పలువురు నేతలు ప్రజాసంఘాల సభ్యులు శనివారం విజయకు అభినందనలు తెలిపారు.