calender_icon.png 9 October, 2024 | 2:54 AM

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కేంద్రం

09-10-2024 12:45:34 AM

ఈడీఐఐ భాగస్వామ్యంతో తెలంగాణలో ఏర్పాటు

ఏటా 5 వేల మంది యువతకు ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పేలా శిక్షణ

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): అహ్మదాబాద్‌లోని ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండి యా (ఈడీఐఐ) భాగస్వామ్యంతో తెలంగాణలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కేంద్రం (ఈడీసీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభు త్వం ఆసక్తితో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

మంగళవారం ఈడీఐఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ శుక్లా మంత్రిని కలిసి తమ సంస్థ చేపట్టనున్న కార్యక్రమాల ప్రతిపాదన లు సమర్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక కన్సార్టియం నెలకొల్పు తుందని మంత్రికి తెలిపారు.

దేశంలో ఈడీఐఐ శిక్షణ కేంద్రాలు 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ లో ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం ద్వారా వచ్చే నాలుగేళ్ల లో 50 వేల మంది యువతకు ఎంఎస్‌ఎం ఈ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవగాహ న, శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపా రు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివ రించారు.

ఏటా కనీసం 5వేల మంది సొంతంగా ఉపా ధి కల్పించుకునేలా, శిక్షణ తర్వా త 6 నెలల వరకు ఈడీసీ సహకారం అందిస్తుందని చెప్పారు. కొవిడ్ సమయంలో అమ్మకాలు లేక నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహకారం అందించి కోలుకునేలా చేస్తామ ని తెలిపారు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థల తరహాలో కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ప్లాట్‌ఫాం ద్వారా ఉచితంగా మార్కెటింగ్ చే సుకోవచ్చని తెలిపారు. ఈ భేటీలో ఈడీఐఐ గోవా ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. 

ఎంఎస్‌ఎంఈ పాలసీలో మహిళలు, దళితులకు ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎం ఈ) విధానంలో మహిళలు, బీసీలు, దళిత పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రయోజనాలు అందేలా చూడాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్ల సమావేశంలో ప్రసంగించారు.

కొత్త పాలసీ అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేసిన ఎంఎస్‌ఎంఈ కొత్త విధానం హ్యాండ్‌బుక్‌ను శ్రీధర్‌బాబు ఆవిష్కరించా రు. ఇందులో ఎంఎస్‌ఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, దరఖా స్తు చేసే విధానం సహా అన్ని వివరాలు ఉన్నాయని వెల్లడించారు.

పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈల అధికారులు సమన్వయం తో పనిచేయాలని ఆదేశించారు.  పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చే యాలని సూచించారు. మరో పదేళ్లలో రాష్ట్ర సంపద ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖదే కీలక బాధ్య త అని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈ స్కీములు, మార్కెటింగ్ పద్ధతులు, శిక్షణ అంశాలపై  ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ మల్సూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్ స్వామినాథన్, రామానంద శుక్లా, గౌరి మోన్వాని, ఆర్ శ్రీనివాస్, రవివర్మ, బావయ్య తదితరులు పాల్గొన్నారు.