జి.అనూరాధ :
ప్రతీరోజు కోట్లాది మందిని దేశం నాలుగు చెరగులకు తీసుకెళ్లి ప్రజలకు సేవలు అందించే అతి పెద్దరంగం భారతీయ రైల్వే. దేశంలో అత్యంత కీలక సేవారంగం అయిన భారతీయ రైల్వే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దీనిని సహజ మర ణానికి గురిచేసేందుకు సిద్ధంఅయినట్లు అనిపిస్తుంది.
కరోనా కాలంలో రద్దు చేసిన అనేక ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ రైళ్లు పునరుద్ధరించకపోగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను సూపర్ ఫాస్ట్‌లుగా పేరుమార్పిడి చేసిన రైల్వే అధికారులు అదనపు చార్జీలు తీసుకుంటున్నారు.
వదిలించుకోవాలన్న ఆలోచన
అత్యధికమంది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్న రైల్వే రంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం శ్రద్ధ కనిపించడంలేదు. కోట్లాదిమంది వినియోగించుకుంటున్న రైల్వేను కేంద్ర ప్రభు త్వానికి ఎప్పుడు వదిలించుకోవాలనే కోరి క, సంస్థను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే శ్రద్ధ మాత్రమే ఉన్నట్లు అర్థమ వుతోంది.
బడుగు బలహీన వర్గాలు, పేదప్రజల అవసరాలను తీర్చే దిశగా కాకుం డా సంపన్నులు మాత్రమే ప్రయాణించే విధంగా రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. వందేభారత్ ట్రైన్లు, ఏసీ రైళ్లను పెంచడం ద్వారా సాధారణ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
అత్యధిక మంది ప్రజలు వినియోగించుకోనే అవకాశాన్ని లేకుండా చేయటం భారతీయ రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా రైల్వేలను దివాలా తీయిం చి అప్పుడు పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
ప్రైవేటురంగంలో వందేభారత్ లాంటి రైళ్లను అధికంగా ప్రవేశపెట్టడం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర పరిధిలో సరిపడే విధంగా రైళ్లు లేకపోవటం వల్ల ప్రజలు పడుతున్న అవస్థలను పాలకులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. రైల్వే వ్యవ స్థను మెరుగు పరచడానికి రైళ్లను పెంచా లి. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలి.
అంతర్గత ప్రాంతాల లో ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాలి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజల అవసరాలు అధికంగా ఉంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరింత మెరు గైన చర్యలు తీసుకోవడం ద్వారా రైల్వేలకు ఆదాయాన్ని పెంచడానికి పూనుకున్నట్లు అవుతుంది.
పండగరద్దీలోనూ పెరగని రైళ్లు
దక్షిణ భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన విజయద శమి, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో తగిన విధంగా రైళ్లను పెంచి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన కేంద్రప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధా ని హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతా ల్లో చదువుకుంటున్న విద్యార్థుల విద్యాసంస్థలకు దసరా సెలవులు ఇవ్వడంతో సొంత ఊర్లకు, బంధువుల ఇండ్లకు పోతుంటారు. ఉపాధి కోసం వచ్చినవారు, ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ఆంధ్ర నుంచి తెలంగాణకు,అక్కడి నుండి ఇక్కడికి వెళ్లడం, దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ప్రజల ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి.
రైళ్లు ఈ సమయంలో కిక్కిరిసి పోతుంటాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రవా ణాసంస్థ , రోజూ కోట్లాదిమంది ప్రజలను గమ్యస్థానానికి చేరవేస్తూ సౌకర్యాలను తీరుస్తున్న భారతీయ రైల్వే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రస్తుత పండగల సందర్భంలో రైళ్ళను పెంచి ప్రజలకు సరిపడా సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభు త్వం, భారతీయ రైల్వే అధికారులు ఎంత మాత్రమూ ఆలోచన చేసినట్లుగా కనిపించడం లేదు.
కానరాని జనరల్ బోగీలు
అంతేకాకుండా ప్రస్తుతం నడుస్తున్న రైల్వేలలో ధనవంతుల సౌకర్యంకోసం ఏసీ బోగీలు ఉండే రైళ్ల ను నడుపుతున్నారు. అందులో జనరల్ బోగీలను ఒకటి రెండు మాత్రమే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంతేకాకుండా వందే భార త్ లాంటి రైళ్లు మరిన్ని పెంచే వైపు కేంద్ర ప్రభు త్వం ఆలోచిస్తున్నదే తప్ప పేదలు వినియోగించుకునే ప్యాసింజర్ రైలు పెంచ డం, దూరపు ప్రయాణానికి జనరల్ బోగీ లు తగిన సంఖ్యలో ఏర్పాటుచేసే వైపుగా ఆలోచించడం లేదు.
గరీబులు ఎక్కడానికి ఎంత మాత్రం అవకాశం లేని రైలుకు గరీ బ్ రథ్ నామకరణం చేసి పేదలకు మేలు చేసినట్లు ఆనంద పడడం తప్ప అందువల్ల గరీబులకు ఒరిగిందేమీ లేదు.
అంతేకాకుండా ఇటీవల రైల్వే మెయింటినెన్స్ ట్రాక్ లైన్‌ల ఏర్పాట్ల పేరుతో దక్షి ణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట జంక్షన్ మీదుగా సాధారణ ప్రజలు ప్రయాణించే అనేక రైళ్లను రద్దుచేయడం,దారి మళ్లించడంతో సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే, అటు నుంచి తెలంగాణవైపు వచ్చే ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
గత వారం రోజులుగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రైళ్లు అన్నీ కిక్కిరిసి పోతున్నాయి. కేవలం రెండు జనరల్ బోగీలు ఉంటే దానికోసం వందల సంఖ్యలో ప్రయాణికులు ఎగబడుతున్న పరిస్థితి. అందులో కాలుపెట్టే జాగాలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణం కోసం పూటలు పూటలు స్టేషన్‌లో ప్రజలు పడిగాపులు పడుతున్నారు.
అంతేకాకుండా ప్రతి రిజర్వేషన్‌బోగీకి ఇద్దరు ముగ్గురు టీసీలు, పోలీసు సిబ్బంది ఉండి రిజర్వేషన్ల బోగీల్లో వయోవృద్ధులు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉండేవారు, చిన్నపిల్లల తల్లులను సైతం ఎక్కనివ్వకుండా మానవీయకోణంలో కూడా చూడకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందులు గమనించే పరిస్థితిలో రైల్వేశాఖ అధికారులకుగాని కేంద్ర ప్రభుత్వం గానీ ఎంత మాత్రంలేదు.
రైళ్ల రద్దుతో అవస్థలు
కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కోసం మధ్యతరగతి వారి కోసమే కాకుండా దినకూలీలు, పేదవాళ్లకు ఉపయోగపడే విధం గా రైల్వేలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా విజయదశమి (దసరా), సంక్రాంతి, దీపావళి లాంటి ప్రజ లు అధికంగా జరుపుకునే పండుగల సందర్భంలో మరిన్ని రైళ్లను పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం కాజీపేట ప్రాం తంలో రైల్వేలో మూడోలైన్ ఏర్పాటు చేస్తున్న సమయంలో శాతవాహన, కృష్ణ, ఇంటర్‌సిటీ, గోల్కొండ లాంటి ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్టులు, పలు ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం వలన ఉద్యోగులు, వివిధ రకాల పనులకు వెళ్లి బతుకుతున్నవారు, సాధారణ ప్రయాణికులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను పడుతున్నారు.
ప్రస్తుత సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రాంతంలో ప్రజలు ఇంకా తీవ్రంగా అవస్థలను పడుతున్నారు.అందువలన ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అదనంగా రైళ్ళను వేయాలి.
కరోనా కాలంలో రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను అన్నింటినీ పునరుద్ధరించాలి. ప్యాసింజర్ రైళ్లనే సూపర్ ఫాస్టులుగా పేరుమార్చి చార్జీలను రెట్టింపు వసూలు చేస్తున్నారు.
దీనిని మార్చి పాత పద్ధతిలోనేప్యాసింజర్ రైళ్ల చార్జీలను పెట్టాలి. సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్‌లలో అదనంగా జనరల్ బోగీలు ముందు, వెనుక పెంచాలి. పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లను విరివిగా ఏర్పాటు చేయాలి. సామాన్య ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యం గా రైల్వే అధికారులు పని చేయాలి.
వ్యాసకర్త సెల్ : 9959632366