ఒకరి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు...
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం వద్ద ట్రాక్టర్ ఢీకొని యాదయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా ఆయన భార్యకు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కాగా, యాదయ్య భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎత్తోండ గ్రామానికి చెందిన యాదయ్య భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం తన స్వగ్రామానికి వెళ్తుండగా జలపల్లి వద్ద అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.