calender_icon.png 3 February, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాజగతికి గోపురం!

03-02-2025 01:21:44 AM

ఎలా వెళ్లాలి..

హైదరాబాద్ నుంచి 600 కి.మీ. దూరంలో మహాబలిపురం ఉంది. అక్కడికి చేరుకోవడానికి 17 గంటల సమయం పడుతుంది. రైలు, బస్సు, విమాన సౌకర్యం కూడా కలదు. 

మహాబలిపురం చెన్నైకి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో అద్భుత చరిత్రను తనలో దాచుకున్న మహాపట్టణం. ఇది పల్లవుల కాలంలో నిర్మించబడింది. ఈ పట్టణానికి మామల్లపురం అనే పేరు కూడా ఉంది. 7వ శతాబ్దానికి చెందిన ఈ పట్టణాన్ని పాలించిన నరసింహావర్మ అత్యంత నైపుణ్యం కలిగిన మల్లయోధులలో ఒకడని చరిత్ర చెబుతుంది.

తమిళంలో గొప్ప మల్లయోధుని మామల్లన్ అని పిలుస్తారు. ఇక ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు తర్వాతి కాలంలో వచ్చింది. క్రీ.శ 650 నుంచి 750 వరకు ఈ ప్రదేశంలో అనేక కళలు, పురావస్తు, శిల్ప సంపద, సాహిత్యం, డ్రామాలు ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి. 1984లో యునెస్కో గుర్తింపు లభించింది. 

తీర దేవాలయం

మహాబలిపురం పర్యటన బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ఆలయం నుంచే ప్రారంభం అవుతుంది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో రాజసింహ పల్లవ క్రీ.శ.670 మధ్య కాలంలో నిర్మించబడింది. ఇది పురాతన దక్షిణ భారత దేవాలయాల్లో ఒకటి. ఇవి ఏడు దేవాలయాలని అందులో ఆరు నీటి అడుగు భాగంలో మునిగిపోయావని అక్కడివారు నమ్ముతారు. ఈ ఆలయం చు ట్టూ ఉన్న నందులను తప్పక చూసి తీరాలి. ఈ సముద్ర తీర ఆల యం నుంచి పక్కనే ఉ న్న మత్స్యకార గ్రామాన్ని కూడా చూడవచ్చు. 

పంచ రథాలు

ఈ పంచ రథాలు శిల్పకళలోనే ప్రత్యేకమైన నిర్మాణం. ప్రతి ఒక్కటీ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇటువంటి రథాలు ఎక్కువగా దేవాలయాల్లో కనిపిస్తాయి. ఐదుగురు పాండవులు ద్రౌపదికి అంకితం ఇచ్చారని చెబుతారు. అయితే అటువంటి కథగానీ, ఇతిహాసం కానీ మన పురాణాల్లో లేదు. బయటిగోడలపై కనిపించే శిల్పాలను ఒకే రాతితో చెక్కారు.