calender_icon.png 8 April, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకోసం అలుపెరగని పోరాటం

03-04-2025 12:00:00 AM

దేశంలో బడుగు బలహీన వర్గాల సం క్షేమం కోసం ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో కులగణన ప్రక్రి యను పూర్తి చేసిన కాంగ్రెస్ అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చరిత్ర సృ ష్టించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.

రాష్ట్ర స్థాయిలో ఆమోదం పొందిన ఈ చారిత్రాత్మక బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కాం గ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తూ, బీసీ సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని కోరుతున్నది.

బీసీ సంక్షేమం కోసం కృషి చేస్తు న్న కాంగ్రెస్ నిర్ణయాలకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 42 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత కోసం బీసీ సం ఘాలు నిర్వహించిన ‘బీసీ పోరు గర్జన’ విజయవంతం కావడం శుభపరిణామం.

భారతదేశంలో సగం జనాభాకుపైగా ఉన్న వెనుకబడిన తరగతి వర్గాలకు జనా భా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమన్యా యం కోసం కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. బీసీలకు సంపూర్ణ న్యాయం జరగా లంటే దేశవ్యాప్తంగా కులగణన చేయడమే సరైన మార్గమని గుర్తించిన కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ దీని కోసం దీర్ఘకా లికంగా డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదు.

షెడ్యూల్ ప్ర కారం దేశంలో జనగణన చేపట్టాల్సి ఉన్నా కరోనా సాకుతో వాయిదా వేసిన బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దేశంలో వీలైనంత త్వరగా జనగణన నిర్వహించి అందులో భాగంగా కులగణన కూడా చేయాలని కాంగ్రెస్ కోరుతున్నా నరేంద్ర మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగాత్మ కంగా తొలుత అధికారంలో ఉన్న తెలంగాణలో శాస్త్రీయంగా, విజయవంతంగా కుల గణన చేపట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

చరిత్రలోనే ఒక మైలురాయి

వెనుకబడిన బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగి వారికి దక్కాల్సిన హక్కులు లభించేలా రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణలో నిర్వహించిన కులగణన స ర్వే దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. స్వ తంత్ర భారతదేశంలో కులగణన జరిపిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది.

ఈ సర్వేకు ప్రత్యేకంగా రూ.160 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నుంచి సవిర సమాచారం సేకరించింది. సర్వేలో ఎలాంటి గందరగో ళం ఏర్పడకుండా భారీగా సిబ్బందిని, డే టా ఆపరేటర్లను  నియమించింది. అనుకో ని అవాంతరాలతో కొందరు సర్వేలో పా ల్గొనక పోతే వారికి మరోసారి అవకాశం కల్పించడం ద్వారా తన నిబద్ధతను ప్రభు త్వం నిరూపించుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అంతటితో ఆగక ఆ ఫలితాలు బీసీలకు వీలైనంత త్వరలో అం దాలనే సంకల్పంతో చర్యలు తీసుకుంది. కులగణనలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందని నిర్ధారణవడంతో అందుకు తగ్గట్టు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ మార్చి 17న అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది.

తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడంతోపాటు భవిష్యత్‌లో సాంకేతిక, న్యా యపరమైన ఇబ్బందులు ఎదురవకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్ర భుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అన్ని వైపుల ఒత్తిడి తెచ్చే చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు తలపెట్టిన ‘బీసీ పోరు గర్జన’కు సంపూర్ణ మద్దతును ఇచ్చి కార్యక్రమం విజయవం తం కావడానికి కృషి చేసింది.

ప్రతిపక్షాలవి నిరాధార ఆరోపణలు

వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిస్వార్థంగా పాటు పడుతున్న కాంగ్రెస్ పా ర్టీని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్వార్థ రాజకీయాలతో విమర్శించడమే పనిగా పెట్టు కున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కప్పదాటు వైఖరితో కులగణన ప్రక్రి యపై బురద జల్లుతున్నాయి. తెలంగాణలో 56 శాతం వున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే అభినందించాల్సింది పోయి ప్రతిపక్షాలు అసత్యాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి.

కులగణనలో బీసీల సంఖ్యను తప్పుగా, తక్కువగా చూపించారంటూ విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఏ ఆధారంగా విమర్శిస్తున్నాయో చెప్పడం లేదు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ కృ షి చేస్తుంటే రాష్ట్రంలో తమ ఉనికికే ప్రమా దం ఏర్పడుతుందనే అభద్రతా భావంతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కూడబలుక్కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెరవెనుక ఒకటిగా ఉ న్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు లోపాయికారి ఒప్పందంతో  పనిచేస్తున్నాయి. కులగణనపై కూడా ఈ రెండు ప్రభుత్వాలు ఇదే తీరులో వ్యవహరిస్తూ బీసీలకు అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

రాబోయే స్థానిక ఎన్నికల్లో బీ సీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని కాం గ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించినా బీఆర్‌ఎ స్, బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం. ఈ రెండు పార్టీ లు అసెంబ్లీలో బిల్లుకు మద్దతును ఇచ్చి గోడమీద పిల్లులవలె ‘ఢిల్లీ బీసీ పోరు గర్జ న’ కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో వాటి నిజ స్వరూపం బయటపడింది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలంటూ చూపుతున్న గణాంకాలకు ఆధారాలే లేవు. ఒకవేళ వారు చెప్పినట్టే కులగణన సర్వేకం టే సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా అధికంగా ఉంటే బీఆర్‌ఎస్ పాలనలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శా తం నుంచి 23 శాతానికి ఎందుకు తగ్గించారో వివరణ ఇవ్వాలి.

బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యమైన రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేకుండా పవిత్రమైన రా జ్యాంగాన్నే మార్చేందుకు కుట్రలు పనుతు న్న బీజేపీ తెలంగాణలో బీసీలపైనా కుట్ర లు చేస్తున్నది. ముస్లింలను బీసీలలో కలపకూడదని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిం చకూడదంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది.

కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక జనాభా లెక్కలకు బ్రేక్ పడడంతో బడుగు బలహీన వర్గాలవారు న్యా యమైన హక్కులను కోల్పోతున్నారు. ప్ర జా సంక్షేమం అందిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించే బదులు తెలంగాణ బీజేపీ నేత లు బీసీలకు న్యాయం చేసే దిశగా 42 శా తం రిజర్వేషన్ల చట్టబద్ధతకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించాలి.

ఈ అంశమే కాకుండా తెలంగాణకు కేంద్రం నుంచి న్యాయంగా దక్కాల్సిన వాటాలు, పథకాలు, నిధులు అందడంలోనూ వివక్షతో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజకీయాలకు అ తీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారు.

చట్టబద్ధత కోసం కలిసి రావాలి

రాజకీయాలను పక్కనపెట్టి బీసీ సంక్షే మం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం వారికి అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న బిల్లు చట్టబద్ధత కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తుంది.

బీసీ వర్గాలకు సమన్యాయం అందించేందుకు ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ ‘బీసీ పోరు గర్జన’ మహాధర్నాకు మద్దతివ్వడమే కాక కార్యక్ర మం విజయవంతం కావడానికి కీలక పా త్ర పోషించింది. మొక్కుబడిగా ఈ ఒక్క కా ర్యక్రమంతో సరిపెట్టకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించడంతోపాటు దేశవ్యాప్తంగా జనగణన, కులగణన కూడా చేపట్టాలని కేంద్రంపై ఒ త్తిడి తెచ్చేలా పోరుబాట పడుతున్న కాంగ్రెస్‌తో ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు సమైక్యంగా కలిసి రావాలి.

వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు