24-02-2025 12:00:00 AM
మంథని, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లా సరిహద్దులోని మలర్ మండలం తాడిచెర్ల కాపురం చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పెద్దపులి ఆవును హత మార్చింది. పెద్దపులి అటవీ ప్రాంతంలో తిరుగుతుందన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పెద్దపులి ఆనవాళ్ళ కోసం అటవీ ప్రాంతాల్లో అధికారులు జల్లడ పడుతున్నారు.
గత మూడు సంవత్సరాల క్రితం పెద్దపులి భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మానేరు దాటి పెద్దపల్లి జిల్లా అడివి శ్రీరాంపూర్ గ్రామం నుంచి ఖమ్మం పెళ్లి వెలుగడ పహాల్ అటవీ ప్రాంతం నుంచి మచ్చుపేట పగుళ్ల గుట్ట అటవీ ప్రాంతంలో ఆవును హతమార్చింది. దీంతో అటివిశాఖ అధికారులు అప్రమత్తమై పెద్దపులి అడుగులతో సమాచారం తెలుసుకొని, పులిని జిల్లాలోని అంతర్గాం మండలంలోని అటవీ ప్రాంతం మీదుగా మహారాష్ర్టకు తరలించారు.
దీంతో ఇప్పుడు పెద్దపులి ఇదే అటవీ ప్రాంతాలైన భూపాలపల్లి జిల్లా నుంచే వస్తుండడంతో అప్పటి పూలే మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి, మనుషులపై దాడి చేయకముందే పెద్దపులిని బంధించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.