calender_icon.png 1 April, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటలో పులి?

13-12-2024 12:19:30 AM

* జాడ కోసం సీసీ కెమెరాలతో నిఘా 

ములుగు, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పెద్దపులి సంచారం అటవీ ప్రాంత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం ములుగు జిల్లాలోకి అడుగుపెట్టిన పులిజాడ రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం ములుగు జిల్లాలోని వెంకటాపురం, మంగపేట మండల అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి మహబూబాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ట్టు అటవీశాఖ అధికారులు భావి స్తున్నారు. చివరగా మంగపేట మండలంలో పులి జాడ గుర్తించిన అధికారులు.. అక్కడి నుంచి తాడ్వాయి మీదుగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోకి చేరినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజ లు, అటవీ శాఖ సిబ్బందిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. పలుచోట్ల సీసీ కెమెరాలను అమర్చి పులి కదలికల కోసం అన్వేషిస్తున్నారు.