కోల్‌కతా: చదరంగంలో భారత్ నుంచి కొత్త చిచ్చరపిడుగు దూసుకొచ్చాడు. కేవలం మూడేళ్ల వయసులోనే కోల్‌కతాకు చెందిన అనీశ్ సర్కార్ చెస్ లిటిల్ మాస్టర్‌గా అవతరించాడు. ప్రపంచంలోనే యంగెస్ట్ రేటెడ్ చెస్ ప్లేయర్‌గా అనీశ్ రికార్డులకెక్కాడు. 2021 జనవరి 26న జన్మించిన అనీష్ మూడేళ్ల వయసులోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
పశ్చిమ బెంగాల్ అండర్-9 చెస్ టోర్నీలో పాల్గొన్న అనీష్ అందరి మన్ననలు అందుకున్నాడు. తనకంటే వయసులో పెద్దవాళ్లను ఓడించిన అనీశ్ 8 పాయింట్లకు గానూ 5.5 పాయింట్లు స్కోరు చేసి 24వ స్థానంలో నిలిచాడు. తన కంటే మెరుగైన ఆరవ్ ఛటర్జీ, అహ్లియాన్లు మట్టికరిపించాడు. ఇటీవల జరిగిన బెంగాల్ రాపిడ్ రేటింగ్ ఓపెన్‌లో భారత టాప్ సీడ్.. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసితో పోటీపడడం విశేషం.