calender_icon.png 15 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉర్రూతలూగించిన మ్యూజికల్ నైట్

13-01-2025 12:00:00 AM

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సైతం మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించటం గమనార్హం. హైదరాబాద్‌లో జరిగిన మ్యూజికల్ నైట్ ఆద్యంతం ఉత్సాహభరి తంగా సాగింది. ఈ వేదికపై హీరో వెంకటేశ్ లైవ్‌లో సినిమాలో తాను పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్‌ను పాడటం అందరినీ ఉర్రూతలూగించింది. అనంతరం ఈవెంట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఇది నా 76వ సినిమా. నా అభిమానులు ఇలాంటి సినిమాలను చాలా ఇష్టపడతారు’ అన్నారు.

‘సినిమా మ్యూజికల్ ట్రీట్ లా ఉంటుంది’అని మీనాక్షి చౌదరి అని తెలిపారు. ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో అద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది’ అన్నారు. డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు, శిరీష్ నా ఫ్యామిలీ.. ఎంతో సపోర్ట్ చేస్తారు. ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే కామెడీ. చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రయత్నించాను. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్ కాబోతోంది.

వెంకటేశ్ ఒక టీచర్‌లా, ఫ్రెండ్‌లా, సడన్‌గా స్టూడెంట్, పెద్దమనిషిలా అనిపిస్తారు. అది వెంకీ గారికే పాజిబుల్. ఈ సినిమా కోసం చాలా గైడ్ చేశారు. హిస్టరీలో వెంకీ సార్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారి విక్టరీయే’ అన్నారు.

‘బ్లాక్ బస్టర్ ఆన్ ది వే. ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లా డుతూ.. ‘నా పాటను జీవిత కాల జ్ఞాపకంగా ఇచ్చిన వెంకటేశ్‌కు థాంక్యూ. ఈ సినిమా క్రెడిట్ అనిల్‌ది. దిల్ రాజు బ్యానర్‌లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. చిత్రబృందం పాల్గొన్నారు.