calender_icon.png 4 March, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషమిస్తున్న ప్రాకృతిక సమతుల్యత

25-02-2025 12:00:00 AM

కొంతకాలం తర్వాత ఈ భూ మిపై ప్రాణవాయువు కొరత ఏర్పడుతుందని, నీటి లభ్యత దుర్లభమవుతుందని, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయని, తత్ఫలితంగా జీవరాశుల ఉనికి భూమిపై అంతర్ధానమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల ను చవిచూస్తున్నాం. నగరాలు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. వాయు కాలుష్యంతో గాలిలో నాణ్యత తగ్గిపోయింది. మారుతున్న పర్యావరణ, వా తావరణ పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉంటున్నాయి.

ఇలాంటి పరిస్థితు లను చక్కదిద్దకుండా ప్రపంచం ఆధిపత్య భావజాలం వైపు, యుద్ధాల వైపు పయనించడం శ్రేయస్కరం కాదు. ఆకలి, దరి ద్రం,  నిరక్షరాస్యత, నిరుద్యోగం, పారిశు ద్ధ్య లోపం, తాగునీటి సమస్య, పౌష్టికాహా ర లోపం, కాలుష్యం, పర్యావరణ విధ్వం సం, వాతావరణ మార్పులు, ఆకస్మిక ప్రళయాలు, ప్రకృతి విలయాలు, యుద్ధాలు ఇత్యాది సమస్యలతో ప్రపంచ మానవాళి కొట్టుమిట్టాడుతున్నది. పీకల్లోతు సమస్య ల్లో కూరుకుపోతున్నా, వాస్తవ పరిస్థితుల ను అవగాహన చేసుకుని, ప్రపంచంలో నె లకొంటున్న సమస్యల పరిష్కారంలో చు రుకైన పాత్ర పోషించవలసిన ఐక్యరాజ్య స మితి, అంతర్జాతీయ సమాజం సుప్తావస్థ లో కాలం వెళ్లదీయడం బాధ్యతారాహిత్యం. 

ఇప్పటికీ తాగునీరు, ఆహార సమస్యలు

గతంతో పోల్చుకుంటే ప్రపంచంలో అక్షరాస్యతా శాతం పెరిగింది. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నిరక్షరాస్యత నిర్మూలింపబడలేదు. పశ్చిమ, దక్షిణాసి యా, సబ్ సహారన్ ఆఫ్రికాల్లో ఇంకా అత్యధిక శాతం నిరక్షరాస్యులున్నారు. మధ్యప్రా చ్యం, ఆఫ్రికా దేశాల్లో ఇంకా లింగ వివక్షత కొనసాగుతున్నది.  వివిధ రంగాల్లో అసమానత్వం అగుపిస్తున్నది. సోమాలియా, దక్షిణ సూడాన్, లిబియా,ఇథియోపియా ఆప్ఘనిస్తాన్,పాకిస్తాన్ తదితర దేశాల్లో బా లబాలికలు చదువుకు దూరంగా ఉంటున్నారు.

సోమాలియాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. పౌష్టికాహార సమస్య తాండవిస్తున్నది. హైతీ, మాలి, సూడాన్, పాలస్తీనా ప్రాంతాల్లో ఆహార సమస్య విపరీతంగా ఉంది. తాగునీటి సమస్యతో పలు దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా యి. కువైట్, లెబనాన్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, సైప్రస్ వంటి దేశాలు ప్రపం చంలో అత్యధిక నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాలు. ఇంగ్లండ్,ఇరాన్,మెక్సికో దేశాల్లోనూ నీటి సమస్య తీవ్రత ఉంది. పలు భారతీయ నగరాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం విదితమే.

వీటికి తోడు జలకాలుష్యం,వాయు కాలు ష్యం పట్టిపీడిస్తున్నాయి. చైనా, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఉక్రెయిన్, గాజా, కాంగో దేశాల ప్ర జలు వివిధ కారణాల వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయిల్,లెబనాన్, గాజా, తదితర దేశాల్లో యుద్ధాల వలన అనేక మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాల ప్రజలు యుద్ధాల వలన ఆర్థికంగా చిన్నాభిన్నమై తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. 

కాలుష్యం అతిపెద్ద సమస్య

ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్యల్లో  కాలుష్యం ప్రధా నమైనది. కాలుష్యం అనేక రూపాల్లో మా నవాళిని కబళిస్తున్నది. కాలుష్యం లేని చో టంటూ ధరాతలంలో మచ్చుకైనా కానరాదు. మనమంతా కాలుష్యానికి ఖరీదు కట్టి కొని తెచ్చుకుంటున్నాము.వాయు కాలుష్యం  మానవ ఆయుః ప్రమాణాన్ని అమాంతం తగ్గించేస్తున్నది. ప్రకృతిని పరిహసించి, పర్యావరణాన్ని హరించి భూ తలంపై జీవ సమతుల్యాన్ని దెబ్బతీసిన మానవుడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకోవడం విడ్డూరం. ప్రపంచంతో పా టు భారత దేశం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకు పోతున్నది.

దేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. కాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరుగుతున్నది. పూ ర్వకాలంలో ఇప్పుడున్న జనాభా లేదు. జనసాంద్రత తక్కువగా ఉండేది.శాస్త్ర విజ్ఞానం పెరిగింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరణాల సంఖ్య తగ్గింది. జనాభా విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు సరిపడా ఆహా రోత్పత్తి జరగాలంటే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఆలోచించాయి. అందుకు తగ్గట్టుగానే అధిక దిగుబడుల కోసం ఎరువులు, రసాయనాలు విరివిగా వాడుతు న్నాం.

వ్యవసాయం, పాడి పరిశ్రమలతో పాటుగా ప్రజలకు ఉపాధికల్పన కోసం అత్యంత వేగవంతంగా పారిశ్రామికీకరణ జరిగింది. పారిశ్రామికీకరణ వలన ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇదే సందర్భంలో పరిశ్రమల వలన కాలుష్యం పెరిగింది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు.

మానవ తప్పిదాల వల్లే..

ప్రకృతి విపత్తులన్నీ చాలావరకు మాన వ తప్పిదాల కారణంగానే సంభవిస్తున్నాయి. వరదలు, భూకంపాలు, తుపాను లు, సునామీలు ఇత్యాదులన్నీ సహజ విపత్తులు.ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించి, విధ్వంసం చేసి, కోలుకోలేని వి ధంగా మానవజీవితాలను అతలాకుతలం చేసిన అనేక సంఘటనలు ఈ ప్రపంచం లో  సంభవించాయి. అతివృష్టి వలన వరదలు సంభవించడం, ప్రజా జీవితాన్ని స్తంభింపచేయడం, అనావృష్టి వలన పం టలన్నీ ఎండిపోయి,ఆహారోత్పత్తి దెబ్బతినడం,తాగడానికే నీరు లేక కటకటలాడడం మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల నుండి కోలుకుని, జనజీవనం సాధారణ స్థితికి రావడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజాజీవనాన్ని పు నరుద్ధరించడానికి ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల అవసరం ఎంతైనా ఉంది. 

నవ్వులపాలవుతున్న మొక్కల పెంపకం

మానవ జీవితాలను అతలాకుతలం చేసే ఇలాంటి ప్రమాదాలన్నీ సాధారణ స్థాయిని దాటి తీవ్రమైన స్థితికి చేరడం వలన విపరీతమైన ప్రాణనష్టం జరుగుతున్నది. ప్రకృతి వైపరీత్యాల్లో వాతావరణ, పర్యావరణ సంబంధమైన అంశాలు మిళితమై ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడుతున్న వైపరీత్యాల్లో మానవ ప్రేరిత  వైపరీత్యాలదే సింహభాగం. ప్రకృతి విలయాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతున్న నేపథ్యం లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించడంలోనే  సకల మానవాళి క్షేమంగా మనుగడ సాగించగలదు.

ఒక వైపు మొక్కల పెంపకం ఆవశ్య కత గురించి చెబుతూనే, మరొక వైపు చెట్లను నరకడం పరిహాసప్రాయమవుతున్నది. సందర్భానుసారంగా మొక్కుబడిగా మొక్కలను నాటి, వాటి సంరక్షణను గాలికొదిలేయడం వలన మొక్కలు నాటే కార్య క్రమాలు నగుబాటు పాలవుతున్నాయి. పర్యావరణ సంరక్షణ సమిష్టి బాధ్యత. దే శంలోను, ప్రపంచంలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పర్యావరణ విధ్వంసమే మూలకారణం. పర్యావరణ ఆరోగ్యం మానవాళికి  శ్రీరామరక్ష. సహజసిద్ధమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకుని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ప్రజల ఆరో గ్యం మెరుగు పడుతుంది. పర్యావరణానికి,ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ భూప్రపంచంలో మానవ మ నుగడ కొనసాగించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలి. 

స్వార్థ ప్రయోజనాలకోసం చెట్లను నరికే విధానం మారాలి. వృక్షజాతిని పెంపొందించాలి. మొక్కలను నాటే కార్యక్రమాన్ని దైవ భక్తి, దేశభక్తితో ముడి పెట్టాలి. చెట్లను పెంచడం వలన వా యు కాలుష్యం తగ్గి మనం పీల్చే గాలిలో నాణ్యతాశాతం పెరుగుతుంది. పచ్చని చెట్లను నరకడం వలన వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటున్నది. మానవాళికి అవసరమైన ప్రాణవాయువు లభించ డం లేదు. మానవ మనుగడకు రక్షా కవచమైన ఓజోన్ పొర దెబ్బతినడం వలన రేడియోధార్మికత వెలువడుతున్నది. దీని వలన అనేక విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇన్ని సమస్యలు పట్టి పీడి స్తుంటే ఈ సమస్యలకు విరుగుడు కనిపెట్టకుండా, ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం అగ్రదేశాలు యుద్ధాలను ప్రేరేపించడం మూర్ఖత్వం.

వ్యాసకర్త సెల్: 9704903463

-సుంకవల్లి సత్తిరాజు