మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి పాలనలో బీసీల మను గడ ప్రమాదకరంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదిలాబాద్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం బీసీ రిజరేషన్లపై కమిషన్ల పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రభు త అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా బీసీలు రిజరేషన్లకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డెడికేటెడ్ కమిషన్ ఇప్పటి వరకు సమీక్షలు, పర్యటనలు చేయకపోవడం దేనికి నిదరనమని ప్రశ్నించారు. బీసీ రిజరేషన్లపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 42 శాతం రిజరేషన్లు ప్రకటించిన తరాతే స్థానిక ఎన్నికలు నిరహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు రమేశ్, జగదీశ్, అశోక్ సామి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.