calender_icon.png 15 January, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వెయ్యి ప్రోత్సాహకం

09-08-2024 12:55:45 AM

చెన్నై (తమిళనాడు), ఆగస్టు 8: తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించే బాలుర కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం కొత పథకాన్ని ప్రారంభించనున్నారు. తమిళ పుధల్వన్ అనే పథకం ద్వారా రాష్ట్రంలోని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 నగదు ప్రోత్సాహకంగా ఇస్తారు. కాగా గతంలో ఇదే తరహాలో ఆడపిల్లల కోసం ‘పుధువై పెన్’ పేరుతో రూ.1000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఇస్పటికే సీఎం ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్థున్న విద్యార్థినులకు నెలకు రూ.1000 చొప్పున్న అంందిస్తున్నారు. తాజాగా ఇదే కార్యక్రమాన్ని ఇంచుమించుగా బాలురకు కూడా విస్తరిపంజేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం కోసం ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  తమిళ పుధల్వన్ పథకం ద్వారా రా్రష్ట్రంలోని దాదాపు 3.28 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.