calender_icon.png 9 February, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై సంపూర్ణ అవగాహన అవసరం

08-02-2025 11:25:52 PM

జిల్లా ఎస్పీ డి జానకి...

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలమని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారం లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన నేర చట్టాలు (BSN, BNS, NSS) పై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తెలంగాణ రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ & రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) ఈపూరి రాములు ద్వారా నూతన చట్టాలను అవగతం చేసుకోవాలని తెలిపారు. నూతన చట్టాల ప్రకారం కేసుల దర్యాప్తు, విదారణలో పాటించవలసిన నూతన, విధానాల మీద క్రింది స్థాయి సిబ్బంది నుండి ఉన్నత స్థాయి అధికార వరకు అందరు సంపూర్ణ సమజ్ఞానం, అవగహన కలిగి ఉండాలని ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.

కొత్త చట్టాల ద్వారా కేసుల విచారణ వేగంగా పూర్తవుతుందని, న్యాయ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడటంలో నూతన చట్టాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీస్ శాఖ నూతన చట్టాలను సమర్థంగా అమలు చేసే దిశగా ముందుకెళ్తుందని తెలిపారు. నూతన చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి మహబూబ్‌నగర్ పోలీస్ శాఖ ఈలాంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఇకమీదట కూడా నిర్వహించబడునని తెలిపారు.

లీగల్ అడ్వైజర్ ఈపూరి రాములు గారు నూతనంగా అమలులోకి వచ్చిన భారత న్యాయ నియమావళి (BNS), భారత సాక్ష్య నిబంధన (BSN), భారత న్యాయపరమైన భద్రతా నిబంధన (NSS) గురించి వివరించారు. కొత్త చట్టాలలో వచ్చిన మార్పులను అధికారులకు వివరించడంతో పాటు కేసుల దర్యాప్తును నూతన చట్టాల ప్రకారం మరింత వేగవంతం చేసే మార్గదర్శకాలను అందించడం, ఆరెస్ట్ ప్రొసీజర్స్, లాండ్ డిస్పుట్, కేసులలో ఆడియో, వీడియొ రికార్డింగ్ మరియు సామాజిక అసౌకర్యానికి కారణమయ్యే నేరాలపై చర్యలు తీసుకునే విధానం గురించి వివరించడం. ఈ చట్టాల ప్రకారం పోలీసుల బాధ్యతలు, దర్యాప్తులో మార్పులు, న్యాయపరమైన చర్యలు ఎలా ఉండాలనే అంశాలపై స్పష్టత ఇచ్చారు.

డిజిటల్ నేరాలు, మహిళల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ నేరాలపై కొత్త చట్టాలు ఎలా సహాయపడతాయో వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో  లీగల్ అడ్వైజర్ ఈపూరి రాములు గారిని జిల్లా ఎస్పీ గారు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమాములో అదనపూ ఎస్పీ రాములు, డిఎస్పి వెంకటేశ్వర్లు, DCRB డిఎస్పి రమణ రెడ్డి, DTC డిఎస్పీ గిరిబాబు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్, జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి, జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్, విమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు జిల్లాలోని SHOలు పాల్గొన్నారు.