calender_icon.png 15 March, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ సేవ జిల్లాల మేనేజర్ల బదిలీలు తొలగింపులపై సమగ్ర విచారణ జరపాలి

11-03-2025 08:38:06 PM

మీ సేవ మేనేజర్ల అక్రమ బదిలీలను వెంటనే ఆపాలి.. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి..

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): మీ సేవ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్న ఈడిఎం (ఈ డిస్టిక్ మేనేజర్స్), డిఎం (డిస్టిక్ మేనేజర్స్) ఇష్టానుసారంగా బదిలీలు, తొలగింపులు చేయడం దారుణమని, బదిలీలను వెంటనే ఆపాలని తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు పౌర సేవలు అందించేందుకు మీ-సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 4758 మీసేవ ప్రాంచైజ్ కేంద్రాలు 33 జిల్లాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలతో పాటు ఇతర పౌర సేవలు అందిస్తున్నాయని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ అన్నారు.

మీసేవ కేంద్రాలు నిర్వహణ వాటిలో తలెత్తే సమస్యల పర్యవేక్షణ కోసం ఈడీఎం, డిఎంలను ఔవుట్  సొర్సింగ్ పద్ధతుల్లో జిల్లాకు ఒకరి చొప్పున ప్రభుత్వం నియమించిందని అన్నారు. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి ఇష్టరాజ్యంగా 12 జిల్లాల మేనేజర్లను నిర్దాక్షణంగా తొలగించారు. వీరి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోస్టర్ పద్ధతి అనేది లేకుండా నచ్చిన వాళ్ళను నచ్చినట్లు నచ్చని వాళ్ళని బదిలీ చేయడము తొలగించడం చేయడం దుర్మార్గ చర్య  అన్నారు. బదిలీలు తొలగింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బదిలీలను వెంటనే ఆపాలని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు.