calender_icon.png 19 April, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

28-03-2025 12:00:00 AM

మునగాల, మార్చి 27:-- సూర్యాపేట జిల్లా మునగాల ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జె. సుదర్శనం అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం బిషప్ డాక్టర్ జె. సుదర్శనం మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గాని ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది మతఛాందసవాదులు చేసిన కుట్రలో భాగమేనని ఆయన దుయబట్టారు. పగడాల ప్రవీణ్ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ప్రవీణ్ హత్యకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రైస్తవ మీడియా కన్వీనర్ జె జె శామ్యూల్ సన్,  మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు ఆదాము, సామ్యూల్ పీటర్, గంధం సైదులు,  పి. పాల్ చారి,  ఎల్. లాజర్, పాస్టర్లు డేవిడ్ రాజు, జె. లుకా, వసంత్, ఓబద్య, ఎం. రాజేష్, జె. సమూయేలు, అబ్రాహాము రాజు, రక్షకన్, విలియమ్స్, ఇ. ఉదయ్, క్రైస్తవులు, యూత్, తదితరులు పాల్గొన్నారు.