- ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 15 ఇండ్ల సర్వే
- ‘గ్రేటర్’లో సర్వేను పర్యవేక్షించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే ముమ్మరంగా సాగుతోం ది. ఆరోరోజు గురువారం ఎన్యూమరేటర్లు రోజుకు గరిష్ఠంగా 15 ఇండ్ల వ రకు సర్వే చేశారు. హైదరాబాద్‌లో ఎ న్యూమరేటర్లు చేపట్టిన సర్వేను మంతి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మిపర్యవేక్షించారు. మేయర్ స్వయం గా సర్వేలో భాగస్వామి అయి ఓ కు టుంబ వివరాలు నమోదు చేశారు.
కొందరు ఎన్యూమరేటర్లు కోడింగ్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారని తెలుసుకున్న అధికారులు, వారికి త గిన సూచనలు ఇస్తున్నారు. ఎన్యూమరేటర్లతో సర్వేను సకాలంలో పూర్తి చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
రేపటి నుంచి బీసీ డెడికేటెడ్ షెడ్యూల్ ఇదే..
రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బీసీ డెడికేటెడ్ కమిషన్ శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనుంది. శనివారం నల్గొండ, ఆదివా రం ఖమ్మం, సోమవారం మహబూబ్‌నగర్‌లో విచారణ ఉంటుందని క మిషన్ ప్రకటించింది. కుల సంఘా లు, ప్రజలు, రాజకీయ పార్టీలు హాజరై, తమ సలహాలు, సూచనలను నివేదించాలని విజ్ఞప్తి చేసింది.