బెంగళూరు: 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణంతో మెరిశాడు. తద్వారా గుల్వీర్ సింగ్ 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. సర్వీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్వీర్ శుక్రవారం 5వేల మీటర్ల రేసును 13 నిమిషాల 54.70 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 1994లో బహదుర్ సింగ్ రికార్డు (13 నిమిషాల 54.72 సెకన్లు) తుడిచిపెట్టుకుపోయింది. శుక్రవారం సర్వీస్ జట్టు ఖాతాలో నాలుగు పతకాలు వచ్చి చేరాయి.
20 కిమీ రేస్ వాక్‌లో సెర్విన్ స్వర్ణం, అర్ష్‌ప్రీత్ కాంస్యాలు గెలుచుకోగా.. లవ్‌ప్రీత్ సింగ్ 5వేల మీటర్ల రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు. మహిళల డిస్కస్ త్రోలో సీమా పూని యా, నిధి, సన్యా యాదవ్‌లు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలు చుకున్నారు. ట్రిపుల్ జంప్‌లో షీనా పసిడి గెలవగా.. అనూష రజతం దక్కించుకుంది. మహిళల 20 కిమీ రేస్ వాక్‌లో రవీనా స్వర్ణం సాధించింది. ఇక మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో మహారాష్ట్ర అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా, ఉత్తర్‌ప్రదేశ్ అథ్లెట్ రుపాల్ చౌదరీ సెమీస్ చేరి కనీసం కాంస్యం ఖరారు చేశారు.