calender_icon.png 8 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న మూడో తరగతి విద్యార్థిని

06-12-2024 06:58:09 PM

ఉపాయంతో తప్పిన అపాయం...

అచ్చంపేట: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదుల రెండు పిల్లర్ల మధ్యలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇరుక్కుంది. విషయం తెలుసుకున్న గ్రామంలోని తాపీ మేస్త్రిలు వారి ఉపాయంతో విద్యార్థిని అపాయం నుండి కాపాడారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సరిత రోజు లాగే మధ్యాహ్నం సమయంలో భోజనం అనంతరం ఆడుకుంటూ వరండాలో ఉన్న రెండు పిల్లర్ల మధ్యలో తలదుర్చడంతో అక్కడే చిక్కుకుని కేకలు వేసింది. పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అదే గ్రామంలో తాపీ మేస్త్రిలుగా పనిచేస్తున్న కొంతమంది యువకులు పిల్లర్లను ధ్వంసం చేసి విద్యార్థిని క్షేమంగా బయటికి తీసారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.