calender_icon.png 17 April, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పునరావాస శక్తికి ఒక నిదర్శనం

17-12-2024 01:59:46 AM

  • ‘లారింజెక్టమీ సొసైటీ’ వ్యవస్థాపకులు ఉమానాథ్ నాయక్
  • ఘనంగా ౨౫వ వార్షికోత్సవం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గొంతు క్యాన్సర్ బారినపడి లారింజెక్టమీ శస్త్రచికిత్సకు గురైన రోగులకు తాము సహాయంగా నిలుస్తున్నట్టు లారింజెక్టమీ సొసైటీ  వ్యవస్థాపకులు, అపోలో హాస్పి టల్స్ సీనియర్ కన్సల్టెంట్ హెడ్‌అండ్‌నెక్ సర న్ ఉమానాథ్‌నాయక్ పేర్కొన్నారు. ఇది కేవ లం సహాయక గ్రూప్ మాత్రమే కాదు.. ఇది మానవ మనోబలానికి, పునరావాస శక్తికి ఒక నిదర్శనమని ఆయన అన్నారు.

సోమవా రం అపోలో మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ‘లారింజెక్టమీ సొసైటీ’  25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయక్ మాట్లాడుతూ.. 1999లో స్థాపించబడిన ఈ సొసైటీ, గొంతు క్యాన్సర్ రోగుల పునరావాసానికి ఒక ఆశాకిరణంగా నిలిచిందన్నారు. ‘ఈ సొసైటీని 25 ఏళ్ల క్రితం రోగులు వారి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం, తమ గొంతును పునరుద్ధరించుకోవడం కోసం ప్రారంభించాం.

కానీ, ప్రస్తుతం మా ప్రయాణాన్ని చూస్తే ఆనందంగా ఉంది’ అని అన్నారు. దాదాపు 90% మంది సభ్యులకు స్పష్టమైన మాటల సామర్థ్యాన్ని అందించడంలో విజయవంతమైనట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్పీ థెరపిస్ట్‌లు, కౌన్సిలర్లు, ఆంకాలజిస్టులు, వలంటీర్లతో కూడిన బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 1999లో అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో స్థాపించబడిన లారింజెక్టమీ సొసైటీ, గొంతు క్యాన్సర్ బారినపడిన రోగులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ అని గుర్తు చేశారు. ఈ వేడుకలో లారింజెక్టమీకి గురైన రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.