calender_icon.png 11 March, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య

10-03-2025 10:59:08 PM

హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడ(Habsiguda)లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నా పోలీసులు మృతదేహలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి(40), కవిత(35), శ్రీతారెడ్డి(13), బిశ్వంత్(10) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.