calender_icon.png 27 December, 2024 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

13-07-2024 12:12:38 AM

రెండు టూరిస్టు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు

నదిలో పడ్డ బస్సు, 65 మంది టూరిస్టుల గల్లంతు

కాఠ్మండూ, జూలై 12 : నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రయాణికులతో వెళ్తున్న రెండు టూరిస్టు బ స్సులు త్రిశూలి నదిలో పడి కొట్టుకుపోయా యి. నారాయణఘాట్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.  ఏ డుగురు భారతీయులు ఉండగా.. ఆ ఏడుగురు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిటాన్ జిల్లాలోని నారాయణ్ ఘాట్‌క్షి రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయా యి. ఓ బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది టూరిస్టులు ఉన్నట్లు గుర్తించారు. రెండు బస్సుల్లో దాదాపు 65 మంది యాత్రికులు ఉండగా వారంతా గల్లంతయ్యారు.