సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బీ సాయి ప్రతాప్‌రెడ్డి, జయశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకొంటోంది. 90వ దశకం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడు తూ.. ‘ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది’ అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ ‘బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులు, లోకేషన్స్‌తో సహజంగా తెరకెక్కించిన సినిమా’ అన్నారు.
“దూరదర్శని’ వాణి, హరిలను ఎలా కలిపిందనేది ఆసక్తికరం గా ఉంటుంది’ అని హీరోయిన్ గీతిక చెప్పారు. జెమిని సురేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అందరిని మళ్లీ చిన్ననాటి గోల్డెన్‌డేస్‌కు తీసుకెళ్తుంది. చాలా రోజుల తర్వాత నాకు ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది’ అన్నారు. దర్శకుడు కార్తియక, తిరుపతిరెడ్డి, నారాయణ, సునీల్ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, సతీశ్ పాల్గొన్నారు.