జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నా రు. ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విడుదలను వాయిదా వేసిన మూవీ టీ మ్.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.