మాజీ ప్రధానికి క్రీడాలోకం సంతాపం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల క్రీడాలోకం అశ్రు నివాళి ప్రకటించింది. భారత దిగ్గజ ఆటగాళ్లు మొదలుకొని సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, గంగూ లీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ , హర్భజన్, పీవీ సింధు, హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, బీసీసీఐ, హాకీ ఇండియా, భారత ఒలింపిక్ సంఘం సహా తదితరులు ఆయనకు సంతాపం ప్రకటించారు.
క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని ప్రగతిపథంలో నడిపించిన మౌన మునితో తమ కున్న అనుబంధాన్ని క్రీడాకారులు ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యట నలో ఉన్న టీమిండియా మన్మోహన్‌కు ని వాళిగా బ్లాక్ ఆర్మ్ బాండ్‌తో బరిలోకి ది గింది. మహిళల జట్టు కూడా విండీస్‌తో చివరి వన్డేలో బ్లాక్ ఆర్మ్ బాండ్ ధరించి మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. క్రికెట్‌లో మూడు ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) భారత్ గెలుచుకున్న సందర్భంలో దేశ ప్ర ధానిగా మన్మోహన్ ఉండడం విశేషం.