‘అమ్మ మనసు’ చిత్రం 1974 నవంబర్ 16న విడుదలైంది. ఈ చిత్రంలో చలం, జయంతి, కైకాల సత్యనారాయణ, భారతి, విష్ణువర్ధన్, శుభ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం అందించారు. టైటిల్ సాంగ్‌తో చిత్రం ప్రారంభమవుతుంది. చిత్రంలో జయంతి వైద్యురాలు. అలాగే ఓ అనాథాశ్రమం నడుపుతూ ఉంటుంది.
ఆమెకు ఒక కుమారుడు ఉంటాడు. అతను మూగవాడు. ఆ బాబును కొన్ని కారణాల వలన తన కుమారుడే అని చెప్పుకోలేదు. బాబు కూడా అనాథాశ్రమంలోనే పెరుగుతుంటాడు. ఈ అనాథాశ్రమాన్ని చలం చూసుకుంటూ ఉంటాడు. సత్యనారాయణ బిజినెస్ మేన్‌గా నటించారు. బాబుతో అమ్మ అని పిలిపించుకోవాలనే జయంతి తపన ఆకట్టుకుంటుం ది.
అమ్మ సెంటిమెంటుతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి సక్సెస్ సా ధించింది. ఆ బాబు ని చలం దత్తతు తీసుకోవడం. ఆ తరువాత అతను పెళ్లి చేసుకోవడం.. ఆ కారణంగా బాబు ఇబ్బందులు పడటం.. చివరకు బాబు అందరి నుంచి వెళ్లిపోవాలనుకుని ఇంటి నుంచి పారిపోతూ ఓ యాక్సిడెంట్‌కు గురవుతాడు.
ఆసుపత్రిలో చికిత్సను అందించగా కోలుకున్న బాబుకు మాటలొస్తాయి. అమ్మ అని పిలుస్తాడు. జయంతికి ఆ విషయం చెప్పేందుకు వెళితే ఆమె మరణించి ఉంటుంది. ప్రతి ఒక్కరితో క్లుమైక్స్ సీన్ కన్నీరు పెట్టిస్తుంది. తల్లి మనసు తనయుడి కోసం ఎంత తల్లడిల్లుతుందనేది కె. విశ్వనాథ్ ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు.