calender_icon.png 7 October, 2024 | 3:50 PM

కన్నీరు మిగిల్చిన మున్నేరు

04-09-2024 02:37:32 AM

  1. ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి  కట్టుబట్టలతో మిగిలిన ఖమ్మంవాసులు 
  2. ఇళ్లల్లో బురద, ఇసుకమేటలు 
  3. కళ్ల ముందే జీవితాలు అతాలకుతలం 
  4. ఆదుకోవాలని కన్నీళ్లతో ఎదురుచూపులు

ఖమ్మం, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరద ముంచెత్తడంతో ఖమ్మంలోని ఏ ఇంటిని చూసినా చిందరవందరగా పడి ఉన్న సామాన్లు, దుస్తులు దర్శనమిస్తున్నా యి. ప్రేమగా పెంచుకు న్న కోళ్లు, కుక్కలు, పశువులు కనిపించక వెక్కివె క్కి ఏడుస్తున్నారు. బొక్కలగడ్డ, కరుణగిరి రాజీవ్ గృ హకల్ప, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ప్రకాశ్‌నగర్, సా యినగర్, మంచికంటినగర్, జలగంనగర్ ఆర్టీసీ కాలనీతో ఇతర కాలనీల ప్రజలు ఆపన్న హస్తం ఎదురు చూస్తున్నారు. పేద, ధనిక భేదం లేకుండా వేలాది కుటుంబాలు సమస్తం కోల్పోయి కట్టుబట్టులతో మిగిలాయి. వరదకు ముందురోజు కడుపునిం డా తిని నిద్రించిన వారిని వరద నీరు ఛిద్రం చేసింది.

వండుకుని తిందామంటే తిండి గింజలు లేవు. ఎవరైనా వచ్చి ఆహా రం అందిస్తారేమోనని కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని, పడిగాపులుగాస్తున్నారు. నీటి లో తడిచి ముద్దయిన ఇళ్లలో బురద, ఇసుక మేట లే కనిపిస్తున్నాయ. దీంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. వేరే చోటకు వెళ్దామంటే ఇష్టంగా కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్లలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. బొక్కలగడ్డ ప్రాంత ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీధులన్నీ బురదమయం అయ్యాయి. మోకాలి లోతులో బురద నిండిపోయింది.

కాలు తీసి ముందుకు పెట్టలేని పరి స్థితి. కరెంట్ స్తంభాలు విరిగిపోయి, ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయి కనిపిస్తున్నాయి. తీగలు తెగి రోడ్ల మీద పడ్డాయి. ఇప్పుడిప్పుడే అధికారులు, పారిశుధ్య కార్మికులు ఖమ్మంలో వీధులను శుభ్రం చేసే పనిలో పడ్డారు. గతంలో వరదలు వస్తే పక్కనే వున్న నయాబజార్ కాలేజీలోకి వెల్లి తలదాచుకుని, పొద్దున్నే ఇళ్లకు వచ్చే వారు. ఈసారి ఊళ్లోకి సైతం వరద ప్రవేశించడంతో భారీ నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. సకాలంలో తొలగించకపో తే అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంది.

సర్టిఫికెట్స్ జారీకి 11న ప్రత్యేక శిబిరం

సర్టిఫికెట్ల జారీకి ఈ నెల 11న ప్రత్యేక శిబిరాన్ని కలెక్టరేట్‌లో చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రకటనలో తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి శిబిరంలో సర్టిఫికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపారు. విదేశాల్లో అడ్మిషన్లు, తదితర అత్యవసర అవసరాలు ఉన్నవారు హాట్ లైన్ నెంబర్ తెలియజేస్తే ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. పాస్‌పోర్ట్, విద్యార్హతలు తదితర సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

1.52 లక్షల ఎకరాల్లో పంట నష్టం

మంత్రి తుమ్మల 

వరదల కారణంగా రాష్ట్రంలో 1,52,278 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 68,345 ఎకరాలు, సూర్యాపేటలో 34,149, మహబాబాబాద్‌లో 25,275 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వరంగల్, నారాయణపేట జిల్లాల్లో 6 వేల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. ఇంకా సీజన్ ఉన్నందున తిరిగి పంటలు వేసుకునే అవకాశం ఉందని, ఇందుకోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశామని చెప్పారు. 

మా గోస ఎవరికీ పట్టలేదు

వరదల సమయం లో డయల్ 100కు, ఇ తర అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒ క్కరూ పట్టించుకోలేదు. ముందస్తు చర్య లు తీసుకోకుండా, వర ద వస్తున్న సంగ తి ముందుగా మాకు చెప్పకపోవడంతో సర్వం కోల్పోయాం. కట్టుకోవడానికి ఒక్క బట్ట మిగల్లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మాకీ గతి పట్టింది. కాపాడే వారి కో సం పడిగాపులు కాస్తే ఒక్క అధికారి కనిపించలేదు. మంత్రులు వచ్చినప్పుడు మాత్రం అందరూ వారి వెంట వస్తున్నారు.

 ఉమ, ఖమ్మం

మేమెలా బతకాలి?

సర్వం కోల్పోయాం .. ఇప్పుడెలా బత కాలి. ఖమ్మం వచ్చిన సీఎం కనీసం మమ్మల్ని పరామర్శించకుండా నే వెళ్లిపోయారు. నేను కిరాణం దుకాణ ం నడుపుతున్నాను. సరుకంతా వరద లో కొట్టుకుపోయింది. సీఎ ం ఇస్తామ న్న రూ.10వేల తో ఏమొస్తుం ది. నేను దాదాపు రూ.4 లక్షల ఆస్తి నష్టపోయా. ప్రభుత్వం న్యా యం చేయాలి. లేదంటే మాకు చావే శరణ్యం.

 రంజిత్, ఖమ్మం

మూడు రోజులుగా చీకటిలోనే..

మూడు రోజులుగా విద్యుత్ లే క చీకటిలోనే మగ్గిపోతున్నాం. పాములు, విష కీటకాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. పాలు కూడా దొరక్క చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వరదలప్పుడు పత్తా లేకుండా పోయిన నాయకులు ఇప్పుడు కనిపిస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక మేము చచ్చామో, బతికేమో చూడడానికి వస్తున్నారా?.                          

 సాహిణి, ఖమ్మం