వెల్దుర్తి: వెల్దుర్తి మండలం యశ్వంత్ రావు పేట గ్రామ నివాసి అయిన బ్యాగరి శ్రీనివాస్ కుమారుడు బ్యాగరి వంశీ వెల్దుర్తి మండలం మంగల్పర్తి హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. గత గురువారం స్కూల్ వదిలిన తర్వాత వంశీ రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడిన వంశీని చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా వారు లేని పరిస్థితి, నిరుపేద కుటుంబమని తెలుసుకున్న మండల ఉపాధ్యాయ బృందం వంశీకి తన వంతుగా ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకొని మంగళపర్తి సీనియర్ ఉపాధ్యాయుడు నల్లచెరువు రామా గౌడ్, మంగల్పర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ మేర్బా బేగం, ఎంఐఎస్ నవీన్ ల కృషి వలన వెల్దుర్తి మండల ఉపాధ్యాయులు, పక్క మండల ఉపాధ్యాయుల బృందంతో కలిసి వంశీ తండ్రి బ్యాగరి శ్రీనివాస్ కు ఒక్క లక్ష మూడు వేల నగదు రూపాయలు చికిత్స నిమిత్తం ఉపాధ్యాయ బృందం ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయమై ఉపాధ్యాయులు పిల్లవాడికి చేసిన సాయంకు గ్రామ, మండల ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.