calender_icon.png 19 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలిని సందర్శించిన చెన్నై వాటర్ బోర్డు బృందం

11-09-2024 03:05:07 AM

మంచినీటి సరఫరా, మురుగు నిర్వహణపై అధ్యయనం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : చెన్నై వాటర్ బోర్డు అధికారుల బృందం మంగళవారం హైదరా బాద్ జలమండలి కార్యాలయాన్ని సందర్శించింది. మంచినీటి సరఫరా, మురుగు నిర్వహణకు ఇక్కడ అవలంభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, రెవెన్యూ అంశాలపై అధ్యయనం చేయడానికి చెన్నై వాటర్ బోర్డు ఎండీ డాక్టర్ టీజీ వినయ్ సారథ్యంలో 8మంది బృందం హైదరాబద్ జలమండలి కార్యాలయానికి రాగా జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వారికి ఇక్కడ తీసుకుంటున్న చర్యలపై వివరించారు.

ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి సరఫరా విధానాన్ని వివరించారు. సమావేశంలో చెన్నై వాటర్ బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ శివకుమార్, ఏఈ విజయ్‌కుమార్, ఏఈఈ మాధవి, ఏఈ శివశంకరి, జలమండలి ఐటీ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఎస్టీపీలను పరిశీలించిన ఈడీ..

నాగోల్, మిరాలంలో నిర్మిస్తున్న మురు గు శుద్ధి కేంద్రా(ఎస్టీపీ)లను జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం పరిశీలించారు. ఎస్టీపీల పనితీరు, నిర్మాణం, వాటిలో ఉపయోగించే సాంకేతికత గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఎస్టీపీ జీఎం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.