calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూను సందర్శించిన అమెరికా సాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ బృందం

16-04-2025 12:21:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15(విజయక్రాంతి) : అమెరికాలోని సాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ ప్రతినిధి బృందం మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. విద్య, పరిశోధనల్లో పరస్పర సహకార అవకాశాలను పరిశీలించేందుకు ఓయూ వైస్ ఛాన్స్‌లర్  ప్రొ. కుమార్ మొలుగరం బృందంతో భేటీ అయింది. ఓయూ నుంచి విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, మార్కెట్ కేంద్రక కోర్సుల్లో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు సాన్ జోస్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విభాగం డీన్ షెరిల్ ఎహర్మాన్, ఆదిత్య సావంట్‌లు తెలిపారు.

ఓయూ విస్తృతి, అంతర్జాతీయ విద్యారంగంలో ఓయూ పాత్ర, గుర్తింపు, విదేశీ విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలపై ఆ ప్రతినిధి బృందానికి ఓయూ వీసీ వివరించారు. విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేస్తున్న కృషిని తెలిపారు. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలలో ఓయూ తో కలిసి పనిచేసే అవకాశం కోసం తాము వేచి చూస్తున్నట్లు సాన్ జోస్ స్టేట్ వర్శిటీ ప్రతినిధులు ఆసక్తి చూపారు.

తదుపరి కార్యాచరణ కోసం సాన్ జోస్ వర్శిటీ ప్రతినిధులతో చర్చలు జరపాలని, అవసరమైన సమాచారాన్ని తీసుకోవాలని వీసీ ప్రొ. కుమార్ ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొ.విజయకు సూచించారు. త్వరలోనే పరస్పర భాగస్వామ్యం దిశగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశం లో రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితెందర్ కుమార్ నాయక్, ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ సంయుక్త సం చాలకులు డాక్టర్ ఆమంచి నాగేశ్వర్ రావు, డాక్టర్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.