23-04-2025 12:00:00 AM
విద్యార్థినీలు, మహిళ టీచర్‌ని వేధిస్తున్న పీఈటీ
ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): జిల్లాలో ఓ కీచక ప్రభుత్వ టీచర్‌ని పోలీసు లు అరెస్టు చేశారు. మావల ప్రభుత్వ పాఠశాల పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న గుండి మహేష్‌పై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీఈటీ గుండి మహేష్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు షీటీంకు వచ్చిన ఫిర్యాదుతో మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఒక యోగ టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల టీచర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సం దర్భంగా షీటీం బృందాలను మరింత విస్తృతంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇబ్బందులు కలిగిన జిల్లాలోని మహిళలు యువతులు, విద్యార్థినిలు ఆదిలాబాద్ షీటీం బృందాలను సంప్రదించాలని తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహనాలను కల్పిస్తుందని తెలిపారు. అత్యవసర సమయంలోనైనా షీ టీం బృందాలను 8712659953 నంబర్‌కు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.