08-02-2025 11:36:44 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే టీచర్ అవతారం ఎత్తారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, మధ్యాహ్న భోజనం, పదవ తరగి విద్యార్థులకు అందజేస్తున్న స్నాక్స్‌పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి గతిలోకి వెళ్లిన ఆయన నేరుగా బోర్డుపై గణిత బోధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ముందంజలో ఉంచాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఎలాంటి భయం,ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు అయ్యేలా వారిలోని భయన్ని తొలగించాలన్నారు. అంతకుముందుకు తహసీల్థార్ కార్యాలయని సందర్శించి రికార్డులను పరిశీలించారు.