01-02-2025 11:52:17 PM
గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘w/o అనిర్వేష్’. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఇది రూపొందుతోంది. త్వరలో ‘w/o అనిర్వేష్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. “అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో రూపొందిన ‘w/o అనిర్వేష్’ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని ‘లింక్డ్ స్క్రీన్ ప్లే’ అనే ఫిలిం టెక్నిక్‌తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంలో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు? అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించాం” అని తెలిపారు.