calender_icon.png 24 October, 2024 | 1:56 PM

కులాల సమగ్ర స్థితిగతులపై సర్వే

24-10-2024 01:39:23 AM

  1. త్వరలో షెడ్యూల్ ప్రకటన
  2. బీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ 

ఖమ్మం, అక్టోబర్ 23 (విజయక్రాంతి):  సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందు కు ఉమ్మడి జిల్లాల వారీగా చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ  నిర్వహణకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవితో కలిసి సర్వేకోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ జరపాలనే ఉద్ధేశం తో ప్రభుత్వం సమగ్ర కులాల సర్వే  చేపట్టిందని తెలిపారు. కులగణన కేంద్రం పరిధిలో ఉందని, బీసీలే కాకుండా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కులాల సమగ్ర వివరాల ను సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఉమ్మ డి జిల్లాల వారీగా కమిషన్ పర్యటించి ప్రజాభిప్రాయం సేకరిస్తుందని తెలిపారు. త్వరలో షెడ్యూల్ ప్రకటించి మీడియా ద్వారా ప్రచా రం చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయానికి అనేక వర్గాలు వచ్చి తమ అభిప్రాయాలను అందిస్తున్నారని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి నవంబర్ 5న  ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో  నిర్వహించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీ నివాస్, ,జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు  పాల్గొన్నారు.