23-02-2025 12:48:27 AM
గత ఏడాది ‘స్త్రీ 2’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అందాల భామ శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఆ జోష్‌ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ‘థామా’లో అవకాశం చేజిక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ కామెడీగా ఈ చిత్రం రూపొందుతోంది. మరి శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తోందంటారా? ఆ విషయంలో స్పష్టత అయితే లేదు కానీ ‘స్త్రీ’ సినిమా తరహాలోనే శ్రద్ధా నటిస్తోందని టాక్.
ఇటీవలే ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఆదిత్య స్పందించారు. “కథ కొనసాగుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన పాత్రలు దానిలో అడుగు పెట్టడం సహజం. సినిమా విడుదలయ్యే సమయంలో దీనికి సంబంధించిన సర్‌ప్రైజ్‌లు కొన్ని మీకు ఇస్తాను. వాటన్నింటినీ మీరే పసిగట్టాలని కోరుకుంటున్నా” అన్నారు. మొత్తానికి ఆదిత్య వ్యాఖ్యలు ప్రేక్షకుల ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.