calender_icon.png 6 February, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్

06-02-2025 07:13:56 PM

ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్ట్..

13120/- రూపాయల నగదు, మూడు సెల్ పోన్లు స్వాధీనం..

ఐదుగురు జూదాగాళ్ల పరారీ..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు ఉపేందర్, లచ్చన్న, టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి గురువారం లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోదెల గ్రామంలో పత్తి చేనులో కొంతమంది జూదరులు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్టార్ స్పోరర్స్ పోలీస్ లు ఆకస్మిక దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న రాగుల రవి, తనుగుల ప్రశాంత్, ఎగ్గడి సత్తయ్య ముగ్గురు పేకాట రాయుళ్ళని పట్టుకుని వారి వద్ద నుండి 13120/- రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు ని స్వాధీనం చేసుకొన్నారు. పరారీలో రాగుల మహేష్, బలరాం, నల్లపు తిరుపతి, రమేష్, మహేష పరారీలో ఉన్నారన్నారు. తదుపరి విచారణ నిమిత్తం లక్షేట్టిపేట్ పోలీస్ లకి అప్పగించడం జరిగిందని తెలిపారు.