calender_icon.png 20 November, 2024 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల కేసు లొంగిపోయిన ఏ2 సురేశ్

20-11-2024 01:35:12 AM

కొడంగల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ 

వికారాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసులో ఏ౨ నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్ ఎట్టకేలకు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సురేశ్‌ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. సురేశ్‌కు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది.

అనంతరం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దాడి జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా యి. నిజానికి సురేశ్ అరెస్టు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. తానే స్వయంగా వచ్చి లొంగిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి కలెక్టర్ బృందాన్ని గ్రామంలోకి తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. గ్రామంలోకి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్నవారు నినాదాలు చేస్తూ కలెక్టర్ వైపు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో సురేశ్ సైతం నినాదాలు చేస్తూ కలెక్టర్ వైపు దూసుకు పోయినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.

దీంతో సురేశ్ పక్కా పథకంతోనే గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పాడని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిని వెంటాడి కొట్టడానికి కూడా సురేశ్ రెచ్చగొట్టడమే కారణ మై ఉండవచ్చునని పోలీసులు బలం గా నమ్ముతున్నారు. సురేశ్‌కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిం చడంతో ఒకటి రెండు రోజుల్లో పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉన్నది.