calender_icon.png 4 October, 2024 | 6:52 AM

త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

04-10-2024 12:31:46 AM

ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

మంచిర్యాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు దవాఖాన నిర్మించడం వల్ల వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంచిర్యాల ఐబీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే కార్యక్రమంలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని గురువారం కూల్చివేసే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్‌ను పట్టణంలో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. రూ.300 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంచిర్యాల జిల్లాతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం రూ.50 కోట్లు తొలి విడతగా కేటాయించిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నియోజక వర్గంలోని నేతలు పాల్గొన్నారు.