26-04-2025 12:00:00 AM
నాలుగు రోజులు తెలికపాటి జల్లులు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు దంచికొండుతుండటంతో జనం మాడు పగులుతున్నది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తటడంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్డ్ జారీచేశారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నా రాష్టంలో పలు చోట్ల రాబోయే 4 రోజులపాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో అత్యధికంగా 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 45.4, నిజామాబాద్ జిల్లా మెండోరలో 45.3, జగిత్యాల జిల్లా అల్లిపూర్‌లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జిల్లాల్లో గత ఏడాది ఇదే సమయంలో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి.