28-04-2025 02:27:18 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ గొప్పదనాన్ని చాటేలా భారత్ సమ్మిట్ జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను నిర్వహించడం గొ ప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేసేందుకు భారత్ సమ్మిట్ వేదికగా ఉపయోగపడిందని చెప్పారు.
ప్రపంచ శాం తి, ప్రపంచ న్యాయం, వాతావరణ మార్పు లు, ఉగ్రవాదం తదితర అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల సాదకబాదకాలను క్లుప్తంగా చెప్పారన్నారు. అన్యా యాన్ని ఎదుర్కొని.. కొత్తశకాన్ని సృష్టించి.. శ్రామికుల హక్కులను కాపాడాలని తీర్మానించారని, ప్రగతిశీల ఉద్యమాల అణిచివేతను భారత్ సమ్మిట్ ఖండించిందని మహే శ్‌కుమార్ గౌడ్ వివరించారు.
మీడియాపై దాడులను రాహుల్‌గాంధీ ఖండిం చారని, సమ్మిట్ వేదికగా రాహుల్‌గాంధీ ప్రగతిశీల పార్టీలకు చెందిన ప్రతినిధులు.. ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు.
సమ్మిట్‌లో ప్రపంచా నికి న్యాయం అందించడం థీమ్ కింద 44 పాయింట్ల ఎజెండాను ఆమోదించడం జరిగిందని, స్వేచ్ఛ.. సమానత్వం.. న్యా యం.. విలువల నిబద్ధతకు సమ్మిట్ తీర్మా నం పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం.. సామాజిక న్యాయం కోసం కృషి చేయడం.. శాంతి, మానవ భద్రత కోసం పనిచేయడం.. ప్రపంచ సంస్థలను సంస్కరించడం వంటి అంశాలపై సమ్మిట్‌లో తీర్మానం చేయడం జరిగిందన్నారు.