తొలి వన్డేలో ఐర్లాండ్‌పై గెలుపుlరాణించిన తేజల్, ప్రతీక
రాజ్‌కోట్: ఈ ఏడాదిని భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. గతే డాది వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఘనమైన ముగింపు పలికిన టీమిండియా కొత్త ఏడాదిని కూడా గెలుపుతోనే ప్రారంభించడం విశేషం. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్మృ తి మంధాన సేన ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటిం గ్ చేసిన ఐర్లాండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ గాబి లూయిస్ (92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిడిలార్డర్‌లో లియా పాల్ (59) అర్థశతకంతో రాణించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2 వికెట్లు తీయగా.. టిటాస్ సాధు, సయాలి సత్‌ఘరే, దీప్తి తలా ఒక వికెట్ తీశారు.
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 34.3 ఓవర్లలో 4 వికె ట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ ప్రతీక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్థశతకాలతో రాణిం చి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఐ ర్లాండ్ బౌలర్లలో అమీ మ గురి 3 వికె ట్లు పడగొట్టింది. మెరుపు అర్థసెంచరీ చేసి న ప్రతీక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకుంది. భారత మహిళల జట్టు తరఫున స యాలీ సత్‌ఘరే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది.
ప్రతీక ఫటాఫట్.. తేజల్ దనాధన్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు మెరుగైన ఆరంభం దక్కలేదు. 10 ఓవ ర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. 25 ఓవర్లలో 100 పరుగుల మార్క్‌ను అందుకున్న ఐర్లాండ్ భా రత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి 200 పరుగుల స్కోరు దాటడానికి 45.2 ఓవర్లు తీసుకుంది.
సాధారణ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంధాన, ప్రతీక రావల్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన మంధాన (29 బంతుల్లో 41) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన అనంతరం పెవిలియన్ చేరింది. మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన ప్రతీక ఆ తర్వాత జోరును చూపించింది.
హర్లీన్ డియోల్ (20), రోడ్రిగ్స్ (9) తొందరగా ఔటైనప్పటికీ తేజల్ హసబ్నిస్‌తో కలిసి ప్రతీక స్కోరు బోర్డును పరుగులెత్తించింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. లక్ష్యానికి దగ్గరగా వచ్చిన క్రమంలో ప్రతీక ఔటైనప్పటికీ రిచా ఘోష్ (8 నాటౌట్)తో కలిసి తేజల్ జట్టును గెలిపించింది.
సంక్షిప్త స్కోర్లు
ఐర్లాండ్: 50 ఓవర్లలో 238/7
(గాబి లూయిస్ 92, లియా 59; ప్రియా మిశ్రా 2/56),
భారత్: 34.3 ఓవర్లలో 241/4
(ప్రతీక రావల్ 89, తేజల్ 59*;
అమీ మగురి 3/57).