భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి గోదావరి నదిపై తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా నూతన సంవత్సర జనవరి 9వ తేదీన సాయంత్రం గోదావరి నదిలో జరగనున్న తెప్పోత్సవానికి అధికారులు హంస వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేసారు. గోదావరి నదిలో ట్రయల్ రన్ ను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. రామాలయం అధికారులు, ఆర్డీవో, ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసు అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు.