- సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
- సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కలకలం
సూర్యాపేట, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహహత్యాయత్నం ఘటన కలకలం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దీపిక ఆరో తరగతి చదు వుతుంది. పాఠశాలలో పనిచే స్తున్న ఏఎన్‌ఎం వెంకటమ్మతోపాటు సిబ్బంది వేధింపులు తాళలేక పాఠశాల రెండో అంతస్తు నుంచి దూకిన ట్టు తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక కాలు విరిగి నడుము భాగంలో తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం ఘటన జరిగినా సిబ్బంది గుట్టుగా ఉంచ డం అనుమానాలకు తావిస్తోంది. విష యం ఆలస్యంగా తెలవడంతో సూ ర్యాపేట జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్ పరామర్శించారు. బాలికతో మా ట్లాడి వివరాలు ఆరాతీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.