నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సంస్కార్ బచ్పన్ ప్లే స్కూల్ విద్యార్థులు బుధవారం వ్యవసాయ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు పంట పొలాలకు వెళ్లి పసుపు మొక్కజొన్న వారి సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంటను విక్రయించిన పరిశ్రమలకు వెళ్లి పత్తిపట్ట అమ్మకాలపై రైతుల సాగు విధానంపై విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రచన, డైరెక్టర్ శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.