17-03-2025 01:22:09 AM
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. విద్యకు, విద్యార్థులకు కేటాయించే నిధులు ఖర్చు గా చూడొద్దు. ఆ సొమ్మును భవిష్య త్తుకు పెట్టుబడిగా చూడాలి. మా ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తాం. విద్యావ్యవస్థలో మునుపెన్న డూ లేని సంస్కరణలు తీసుకొస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ‘యావత్ ప్రపంచాన్ని విజ్ఞాన పథం వైపు నడిపించే ఏకైక శక్తి విద్య. విద్యతోనే సమాజ భవిష్యత్తు. దేశ సౌభా గ్యం. అయితే.. ఆ విద్యా వెలుగులను నేటితరానికి పంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అంటూ ఓ తత్తవేత్త విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పారు.
కానీ.. గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఏటా ప్రభు త్వాలు ప్రవేశపెడుతున్న వార్షిక బడ్జెట్ల లో విద్యపై కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి. దేశంలోనే చిన్న రాష్ట్రాలని పేరున్న ఈశాన్య రాష్ట్రాల కంటే తెలంగాణలో విద్యకు తక్కువ కేటాయింపులు జరగడం శోచనీయం. రాష్ట్రం ఏర్ప డిన తొలి ఏడాది తప్ప, మిగతా అన్ని బడ్జెట్లలోనూ కేటాయింపులు 10శాతం కంటే మించలేదు.
దీంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందంగా విద్యావ్యవస్థ తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లో విద్యకు 10.89 శాతం కేటాయింపులు జరిగాయి. గతేడాది కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం కూడా విద్యకు రూ.21,292 కోట్లు మాత్రమే కేటాయించింది.
ఈ కేటాయింపులు అంతకుముందు ఏడాది కంటే మెరుగే అయినప్పటికీ, మొత్తంగా చూస్తే ఆ కేటాయింపులు బడ్జెట్‌లో కేవలం 7.3 శాతం మాత్రమే. 2023 24 బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు రూ.19,093 జరగ్గా, అది మొత్తం బడ్జెట్‌లో 6.5 శాతం మాత్రమే. వీటితో పోల్చుకుంటే 2024 25లో రూ.2,199 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికల ముంద్ర కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటిచింది. కానీ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యాపరంగా నీరుగారే విధంగా ఉంది. ఈనెల 19న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయింపులు జరుగుతాయా ? లేదంటే షరామామూలే అన్నట్లుగా ఈసారి కూడా అరకొర కేటాయింపులతో సరిపెట్టాస్తారా ? అనేది.. వేచి చూడాల్సిందే !
పది శాతం దాటలేదు..
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గతేడాది రెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెండు బడ్జెట్లలోనూ విద్యకు కేటాయింపులు తక్కువగానే జరిగాయి. ఓట్ ఆన్ అ కౌంట్ బడ్జెట్‌లో విద్యకు 7.5 శాతం కేటాయింపులు చేయగా, పూర్తిస్థాయి బడ్జెట్‌లో 7.3 శాతమే కేటాయింపులు జరిగాయి.
వేతనాలకే రూ.15 వేల కోట్లు..
2024 తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో విద్యకు మొత్తం రూ.21,292 కోట్లు కేటాయిచంగా, వీటిలో ఉన్నత విద్యకు రూ. 3,350 కోట్లు, పాఠశాల విద్యకు రూ.17,942 కోట్ల కేటాయింపు జరిగింది. పాఠశాలకు కేటాయించిన నిధుల్లో సుమారు రూ.15 వేల కోట్లు ఉపాధ్యాయులు, సిబ్బంది వేతనాలకే వెళ్తుంది. ఇక మిగిలిన నిధులతో పాఠశాలల అభివృద్ధి సాధ్యం కాదు.
ఉన్న సొమ్ముతో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ, సామగ్రి కొనుగోలుకు సరిపోతుందంతే. 2023 బడ్జెట్‌లో సెకండరీ విద్యకు రూ.16,092 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.3,001 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2023 24తో పోల్చుకుంటే 2024 ఉన్నత విద్యకు రూ.349 కోట్లు అదనంగా కేటాయించగా, సెకండరీ విద్యకు కూడా రూ.1,850 కోట్లు అధికంగా కేటాయింపులు జరిగాయి. 2022 23 బడ్జెట్‌లో ఉన్నత విద్యకు సర్కార్ రూ.2,357 కోట్లు ప్రతిపాదించింది. బడ్జెట్‌లో ఏటా కేటాయించిన నిధులు కూడా పూర్తిగా విడుదల కావని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఆ హామీలు అమలయ్యేనా?..
కాంగ్రెస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టో, యూత్ డిక్లరేషన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, యూత్ కమిషన్‌ను అమలు చేస్తామని యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, గత బడ్జెట్‌లో ఈ హామీల ప్రస్తావనే లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారైనా అది అమలవుతుందా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసినప్పటికినీ ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసి యువతలో ఇంకా విశ్వాసా న్ని పెంచాల్సి ఉంది.
చిన్న రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ కేటాయింపులు..
దేశంలో అతిచిన్న రాష్ట్రాలని పేరున్న ఈశాన్య రాష్ట్రాల్లో నూ విద్యకు 12 13 శాతం కేటాయింపులు ఉంటున్నాయి. తెలంగాణలో మా త్రం ఏటా కేటాయింపులు 10 శాతం మించడం లేదు. 2025 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు 0రూ. 31,805.65 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506.01 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.1,228.94 కోట్ల కేటాయింపులు జరిగాయి.
అలాగే కర్ణాటక 2024 బడ్జెట్‌లో విద్యకు 12 శాతం కేటాయింపులు జరిగాయి. కాకపోతే 2025 బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు 10 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ ఆ కేటాయింపులు తెలంగాణ కంటే ఎక్కువే.