calender_icon.png 4 February, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి మొండిచేయి

04-02-2025 12:14:17 AM

ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్ 

ఎల్బీనగర్: కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి మొండిచేయి చూపించిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యరంగానికి మొండిచేయి చూపడంతో సోమవారం రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ శంకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి మొండిచేయి చూపించిందన్నారు. పేద వర్గాలకు విద్యను దూరం చేయాలనే సదుద్దేశంతో కార్పొరేట్, ప్రైవేటీకరణకు దగ్గర చేస్తున్న బడ్జెట్‌లో కేటాయింపులు న్నాయన్నారు. గతంతో పోలిస్తే  విద్యారం గానికి బడ్జెట్‌లో  నామ మాత్రంగా  0.2% మాత్రమే పెరిగింది. 

రూ.12467.39 కోట్ల నుంచి రూ. 12500 మాత్రమే విద్యారం గానికి నిధులు పెరిగాయన్నారు. ఉన్నత విద్య కోసం నామమాత్రంగానే 2025-2026 బడ్జెట్ కనిపిస్తుంది రూ. 47619.77 కోట్ల నుండి రూ. 50077.95 కోట్లకు కేవలం 5% మాత్రమే పెరుగుదల చూడ వచ్చు అన్నారు.

విద్యారంగానికి నిధులు కేటాయించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వేణు, ప్రణయ్, మహేష్, ఆశ్రిత, శ్రీలత పాల్గొన్నారు.