సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్
చింతలపాలెంలో రైతులతో ముఖాముఖి
నల్లగొండ, ఆగస్టు 7 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి కొత్తగా పటిష్ట చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోందని రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ తెలిపారు. జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం చింతలపాలెంలో బుధవారం ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోందని వె ల్లడించారు.
రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న వివిధ రకాల భూసమస్యల్లో మెజార్టీవి తిరుమలగిరి మండలంలో ఉండటంతో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తిరుమ లగిరి మండలంలోని భూసమస్యల పరిష్కారానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ప్ర త్యేకంగా నియమించినట్లు తెలిపారు. చింతలపాలెం గ్రామంలో 6వేల ఎకరాలకు పట్టా లు ఇవ్వాల్సి ఉందని, 3900 ఎకరాలకు బోగస్ పట్టాలు తొలగించాల్సి ఉందన్నారు. ధరణి కమిటీ సభ్యుడు, ప్రముఖ భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ దానిపై హక్కు ఉండాలని ప్రభుత్వం భావించి కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని పేర్కొన్నారు.