ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు, నగర జీవనానికి కాసేపు ఫుల్ స్టాప్ పెట్టి ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి బెస్ట్ స్పాట్ చిక్‌మగళూర్. ఇది కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది. చిక్‌మగళూర్ టూర్ కేవలం ప్రశాంతత కోసం మాత్రమే కాకుండా అక్కడి సంస్కృతిని తెలుసుకోవడానికీ ఉపయోగప డుతుంది. దారి పొడుగునా.. పొగమంచు.. సుగంధభరితమైన కాఫీ తోటల పరిమళాలను ఆస్వాదిస్తూ జర్నీ చేసేయొచ్చు.
ముల్లయన్ గిరి పర్వత శ్రేణుల్లో స ముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో చిక్‌మగళూర్ హిల్‌స్టేషన్ ఉంటుంది. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్య లో వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో చిక్‌మగళూర్ పర్యటన ఆహ్లాదభరితంగా ఉంటుంది. కాఫీ తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. కాఫీ రుచులు, సువాసనలను ఆస్వాదిస్తూ.. ప్రకృతి అందాలను వీక్షించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఎత్తున పర్వతాలు, విస్తారమై న కాఫీ తోటలు, సెలయేళ్లు, జలపాతాలు, ఉద్యానవనాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిక్‌మగళూర్ చుట్టూ ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి.
ఝరి జలపాతం..
ఝరి వాటర్ ఫాల్స్.. అత్తిగుండి నుంచి దాదాపు ౯౦కి.మీ.ల దూరంలో ఉంది. తెల్లగా ఉండే నీటి ధారలను పోలి ఉంటుంది. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
కాఫీ మ్యూజియం
చిక్‌మగళూర్‌లో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి కాఫీ మ్యూజియం. ఇది చిక్ మగళూర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాసరహల్లిలో ఉంటుంది. చిక్‌మగళూర్ వెళ్లిన వాళ్లెవరూ ఈ కాఫీ మ్యూజియాన్ని చూడకుండా రారు. ఘుమఘుమలాడే కాఫీ గింజల పరిమళాన్ని ఆస్వాదిస్తూ.. కాఫీ మొక్క నుంచి కాఫీ తయారయ్యే వరకు ప్రతి ప్రక్రియనూ చూడవచ్చు.
ఎలా వెళ్లాలంటే..
ఇది హైదరాబాద్ నుంచి ౬౪౦ కి.మీల దూరం వుంటుంది. అక్కడికి చేరుకోవడానికి సొంత వాహనంలో అయితే సుమా రు ౧౨ గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ బస్ సౌకర్యం ఉంటుంది. అక్కడినుంచి చిక్‌మగళూర్ వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.